డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు పట్ల హర్షం
NEWS Nov 04,2024 10:38 am
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు గతంలో ఉన్న వాటికంటే 40 శాతం అదనంగా చార్జీలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయటం పట్ల భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎ.పద్మావతి, కళాశాల స్టాప్, సిబ్బంది, స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థిని, విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.