వైట్‌వాష్ అవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి!
NEWS Nov 03,2024 11:38 am
సొంతగడ్డపై సిరీస్ క్లీన్‌స్వీప్ అవ్వడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. టీ20, వన్డే మ్యాచులు ఆడే టీమ్‌తో టెస్టు ఆడిస్తే ఫలితం ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 3 టెస్టుల సిరీస్‌లో సొంతగడ్డపై భారత్ తొలిసారి క్లీన్‌స్వీప్ అయిందని, ఇది తమకు హార్ట్ బ్రేకింగ్‌గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కోచ్ గంభీర్ వల్లేనని, టెస్టులకు ఆయన ఆలోచనలు పనికిరావంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.