ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం కృషి
NEWS Nov 03,2024 11:32 am
సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులుగా నవాబు రాచిరెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా నవాబు రాచి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎలా పని చేశానో, సంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు ఆత్మ గౌరవం, సంక్షేమ కోసం అంతే నిబద్ధతగా పనిచేస్తానని అన్నారు. ఉద్యమకారులందరికి ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.