బంగ్లాదేశ్: రక్షణ లేదంటూ 30వేల మంది హిందువుల ర్యాలీ
NEWS Nov 03,2024 06:46 am
బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా హింసతో రక్షణ లేకుండా పోయిందని హిందువులు వాపోతున్నారు. తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ సిటీలో హిందువులు రోడ్డెక్కారు. ఏకంగా 30 వేల మంది భారీ ర్యాలీ జరిపారు. తమకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు.