గడువులో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
NEWS Nov 02,2024 05:35 pm
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేసి సంబంధిత బిల్లులు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తు, టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు చేసిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు.