పెద్దపల్లిలో BJP సభ్యత్వ నమోదు
NEWS Nov 02,2024 12:32 pm
పెద్దపల్లి జిల్లా నందన గార్డెన్లో అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ప్రదీప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సెప్టెంబర్ 2న బిజెపి నూతన ప్రాథమిక సాధారణ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల పైచిలుకు సభ్యత్వం నమోదు అయ్యిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 50,000 పూర్తయిందన్నారు.