కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
NEWS Nov 02,2024 10:39 am
హత్నూర మండలం బడంపేట్ గ్రామ బూత్ అధ్యక్షులు కొమరయ్య శుక్రవారం ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, కొమరయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, కొమరయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు అనుమానం ఉందని,పూర్తి స్థాయి విచారణ చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.