వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
NEWS Nov 02,2024 10:02 am
మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్, రాజేశ్వరరావుపేట, కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్లు నేరెళ్ల శంకర్, నవీన్, ఏఈవో మనోజ్ఞ, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు, శ్రీనివాస్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.