తెలంగాణ కులగణన.. ప్రశ్నలివే..
NEWS Nov 02,2024 06:40 am
TG: నవంబర్ 6 నుంచి 30 వరకు తెలంగాణలో కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి వివరాలు అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుంది.