ఆ కథనాలు అవాస్తవం: రాచమల్లు
NEWS Nov 02,2024 08:15 am
ప్రొద్దుటూరు: వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కౌన్సిలర్లుగా గెలిచిన 40 మందిలో 11 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో వీరికి టిడిపి టికెట్ ఇచ్చే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోష్యం చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజుల క్రితం కొన్ని ప్రముఖ టీవీ చానల్స్ నందు మున్సిపల్ చైర్మన్ పదవి టిడిపి కైవసం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంపై వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన చెప్పారు.