మెట్‌పల్లిలో కమ్ముకున్న పొగమంచు
NEWS Nov 02,2024 05:36 am
మెట్‌పల్లి పట్టణంలో చలి మొదలైంది. ఈరోజు ఉదయం పొగ మంచు కమ్మేసింది. వెల్లుల్ల రోడ్డులో పొగ మంచు కమ్మేయడంతో అంతా చీకటిగా మారింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు రోడ్లు కనిపించక ఇబ్బంది పడ్డారు. కాగా, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉదయం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఆలస్యంగా బయటకు వెళ్లారు.