బీసీల సమస్యలపై కమిషన్‌కు వినతి
NEWS Nov 01,2024 05:03 pm
బీసీల రిజర్వేషన్ల సమస్యలను పరిష్కరించాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్‌కు కోరుట్ల నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. EWS రిజర్వేషన్లతో బీసీలు రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని వాటిని రద్దు చేయాలన్నారు. బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో 42 శాతం, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. లింబాద్రి, అంజయ్య తదితరులు ఉన్నారు.