కళాశాలలో విజిలెన్స్ అవగాహనపై పోటీలు
NEWS Nov 01,2024 07:14 pm
పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో విజిలెన్స్ అవగాహనపై ఇంజనీరింగ్ విద్యార్థులకు "జాతీయ అభివృద్ధికి అవినీతి రహిత సమాజం పాత్ర" అనే అంశంపై కెటిపిఎస్ సిఈ ఎన్ ప్రభాకర్ రావు, విజిలెన్స్ డిఎస్పి ఎన్ రమేష్ మరియు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఆద్వర్యంలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నైపుణ్యాన్ని కనబరచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ టి.భరత్ కృష్ణ, డీన్ అవని, డైరెక్టర్ డా ఎన్ వి సుబ్బారావు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.