కొత్త సీఎం ఖాయం: మహేశ్వర్ రెడ్డి
NEWS Nov 01,2024 01:45 pm
డిసెంబర్‌లోపే కొత్త సీఎం వస్తాడంటూ BJP శాసన సభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. 7 నెలలగా CM రేవంత్ రెడ్డికి రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, AICCకి వస్తున్న ఫిర్యాదులు.. పరిస్థితులు చూస్తే రేవంత్‌కి ప్రత్యామ్నాయం చూస్తున్నారని, సీఎం రేసులో ఉన్న ముగ్గురు సీనియర్ మంత్రులు.. పరిస్థితులను అధిష్ఠానానికి పూస గుచ్చినట్టు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ ఇప్పటికే.. ఉత్తమ్ సీఎం అవుతారని చెప్పినట్టుగా గుర్తుచేశారు.