90 వేల దిశగా బంగారం ధరలు!
NEWS Nov 01,2024 11:48 am
రూ.80 వేల మార్కును దాటిన బంగారం ధరలు రూ.90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఉదయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,719 పెరిగి రూ.81,340కు చేరుకుంది.హైదరాబాద్ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.74,560గా ఉన్నది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.