ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
NEWS Nov 01,2024 11:22 am
మైదుకూరు అమ్మవారిశాలలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైదుకూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో అమ్మవారి శాల నుండి మార్కెట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను కొనియాడారు.