మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్..!
NEWS Nov 01,2024 10:39 am
ఢిల్లీ: NIPFP సంస్థ నిర్వహించిన సర్వేలో.. తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో గతేడాది సగటున మద్యం కోసం ఒక్కో వ్యక్తి రూ.1,623 ఖర్చు చేయగా.. ఏపీలో రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గడ్‌లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. తెలంగాణలో ఇటీవల దసరా సందర్భంగా రూ.1,000 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరిగాయి.