బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు
NEWS Nov 01,2024 11:50 am
టేక్మాల్ మండల కేంద్రంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు డాకప్ప నవీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లుపేట రాజు, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సిద్ధిరాములు, మండల ఉపాధ్యక్షులు వడ్డె రాములు, టేక్మాల్ పట్టణ అధ్యక్షులు దొడ్లె నాగరాజు, తిమ్మిగారి సంతోష్, పట్లోళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.