కొవ్వొత్తి చీరకు అంటుకుని యువతి గాయాలు
NEWS Nov 01,2024 07:18 am
దీపాలు వెలిగిస్తుండగా పొరపాటుగా కొవ్వొత్తి చీరకు అంటుకొని యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. పుల్లంపేట మండలం రామాపురం గ్రామంలో గురువారం రాత్రి యువతి దీపాలు వెలిగిస్తుండగా కొవ్వొత్తి చీరకు అంటుకొని మంటలు చెలరేగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన కుటుంబీకులు వెంటనే యువతని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు గాయాలను పరిశీలించి వైద్యం అందిస్తున్నారు.