మల్యాలలో ఇందిరా వర్ధంతి వేడుకలు
NEWS Nov 01,2024 07:11 am
మల్యాల మండలంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద గల ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను, ప్రజాస్వామ్యంలో ఆమె చేసిన సంస్కరణలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, మ్యాక లక్ష్మణ్, తిరుపతి, హరినాథ్, బాబు, గంగాధర్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.