రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన
NEWS Oct 31,2024 04:53 pm
NLG: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సోమన్నవాగు హైలెవల్ బ్రిడ్జ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్తపల్లి–పగిడిమర్రి రోడ్, పగిడిమర్రి–మదనాపురం రోడ్, పగిడిమర్రి–కుదావన్పూర్ రోడ్ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.