పండుగ పూట ఇద్దరు బాలురు మృతి
NEWS Oct 31,2024 04:52 pm
వలిగొండ మండల కేంద్రంలో పండుగ పూట విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన జీవన్, కిరణ్ అనే ఇద్దరు చిన్నారులు చేపల వేటకు వెళ్లి మూసిలో గల్లంతయ్యారు. కిరణ్ అనే చిన్నారి మృతదేహం లభ్యం కాగా జీవన్ మృతదేహాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో వారిరువురి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.