రాజకీయాలు వదిలేద్దామనుకున్నా: KTR
NEWS Oct 31,2024 05:22 pm
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, తమకు మార్గనిర్దేశనం చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. X వేదికగా ASK KTR పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. 2025 నాటికి కేసీఆర్ ప్రజల్లోకి వెళతారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందిపడవలసి వచ్చిందని, ఓ దశలో రాజకీయాల నుంచి బయటకు పోవాలని భావించానని, ప్రజల కోసం ధైర్యంగా నిలబడటమే మంచిదని కొనసాగుతున్నట్లు చెప్పారు.