చిన్నారులతో కడియం దీపావళి వేడుకలు
NEWS Oct 31,2024 01:26 pm
దీపావళి పర్వదినాన్ని పరిష్కరించుకొని హన్మకొండ మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.