పెంచల బాబుకు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నివాళి
NEWS Oct 31,2024 07:51 am
బద్వేల్: బద్వేల్ వైసీపీ నాయకుడు 16వ వార్డు కన్వీనర్ వనం పెంచల బాబు గురువారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గురువారం ఉదయం వారి స్వగృహానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.