జ్వరంతో 4 నెలల చిన్నారి మృతి
NEWS Oct 31,2024 07:42 am
అనంతగిరి: బొర్రా పంచాయతీ గేటువలస గ్రామానికి చెందిన వంతల సోని, పుష్పల 4 నెలల చిన్నారి గురువారం ఉదయం మృతి చెందింది. 3 రోజులు నుండి తీవ్ర విష జ్వరంతో బాదపడుతూ చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించినప్పటికీ చిన్నారి దక్కకుండా పోయిదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పండగ రోజు చిన్నారి మృతితో గేటువలస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.