మస్క్ కంపెనీలో హిందీ ట్యూటర్ జాబ్స్
NEWS Oct 30,2024 06:09 pm
ఎలాన్ మస్క్‌కు చెందిన X - AI సంస్థ హిందీ, ఇంగ్లిష్ భాషల నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం హిందీ ట్యూటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ట్యూటర్లు AI మోడల్‌కు హిందీ భాషలో ట్రైనింగ్ ఇస్తారు. గంటకు రూ. 2,900 నుంచి రూ. 5,400 వరకు పేమెంట్ ఉంటుంది. దరఖాస్తుదారులు తమ సొంత స్థలంలో నుంచే పని చేయవచ్చు. వారంలో 5 పనిదినాలే.