రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు
సెయింట్ మోహిత్ పూర్ణ ఎంపిక
NEWS Oct 30,2024 06:11 pm
ఈనెల 28న గుడివాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో సెలక్షన్ నందు సెయింట్ ఆన్స్ హై స్కూల్ గుంటుపల్లి నుండి అండర్ -14 విభాగంలో మోహిత్ పూర్ణ 9వ తరగతి విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జెయిన్ ఆంటోని, సిస్టర్ రోజ్లి తెలిపారు. రాష్ట్రస్థాయి ఖోఖో సెలక్షన్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు జి. బాలరాజు, టి. పుల్లారావులను పాఠశాల యాజమాన్యం, పాఠశాల సిబ్బంది అభినందించారు.