కేటీఆర్ బామ్మర్ది - 8 గంటల విచారణ
NEWS Oct 30,2024 05:47 pm
జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను 8 గంటల పాటు రాజ్ పాకాలను విచారించారు మోకిల పోలీసులు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. విచారణ మధ్యలో రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌస్ కు తీసుకువెళ్లారు. గంట పాటు ఫాంహౌస్‌లో సోదాలు చేశారు. విజయ్ మద్దూరి ఫోన్ చుట్టూ విచారణ కొనసాగింది. గతంలో జరిగిన పార్టీలు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంపై అరా తీశారు పోలీసులు. విచారణలో రాజ్ పాకాల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.