అనంతారం వంతెనకు మరమ్మతులు పూర్తి
NEWS Oct 30,2024 05:51 pm
జగిత్యాల రూరల్ మండలం అనంతారం వద్ద ఈనెల 17న చేపట్టిన తాత్కాలిక మరమ్మతులు బుధవారం పూర్తి చేశారు. గత కొన్ని రోజులుగా భారీ వాహనాలు కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి మీదుగా, కార్లు,బైకులు పొలాస స్టేజి నుండి గుల్లపేట మీదుగా రాకపోకలు సాగాయి. నేటి నుండి అనంతారం వంతెన పైనుంచి ప్రయాణం చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.