దీపావళి పండగకు ముందు అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. గిన్నీస్ రికార్డు దీపోత్సవ వేడుకల్లో ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులు పలు ఆకట్టుకునే ప్రదర్శనలు చేశారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపోత్సవం.