మంజీరా విద్యాలయంలో దీపావళి పండుగ
NEWS Oct 30,2024 06:17 pm
రామాయంపేట మండల కేంద్రంలోని మంజీర విద్యాలయంలో ముందస్తు దీపావళి పండుగ నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీకటిని పారదోలుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చే పండుగ దీపావళి అని అన్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. విద్యార్థులకు దీపావళి పండుగపై అవగాహన కల్పించేందుకు ముందస్తు దీపావళి పండుగ నిర్వహించినట్లు కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి తెలిపారు.