మమత అకాడమీ ఉచిత వైద్య శిబిరం
NEWS Oct 30,2024 01:39 pm
టేక్మాల్ మండల కేంద్రంలో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హస్పిటల్ బాచుపల్లి వారు స్థానిక గాంధీ భవన్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. బీపీ, షుగర్, పీడియాట్రిక్,మల్టీస్పెషల్టి తదితర జబ్బులపై వైద్య సేవలు అందిస్తున్నట్లు డా. నయింరాజ్, క్యాంపు మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. మండల ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మారు కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.