వైద్య వృత్తి గొప్పది: MLA మాధవి రెడ్డి
NEWS Oct 30,2024 05:26 am
కడప నగరంలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో ఎక్సెషియా ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా గొప్పదన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, కాలంతో పరిగెత్తుతూ గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.