గణపతి నరేందర్ రాజుకు సన్మానం
NEWS Oct 30,2024 04:25 am
ఇటీవల డీఎస్సీ పరీక్షల్లో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామం నుండి ఎంపికైన గణపతి నరేందర్ రాజుకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా మెట్‌పల్లి పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో జూనియర్ కాలేజీ లెక్చరర్స్ నరేందర్ రాజును అభినందించి సన్మానించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ.. తమ వద్ద విద్య నేర్చుకున్న శిష్యుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపిక కావడం, సంతోషంగా ఉందని తెలిపారు. అధ్యాపకులు శ్రీనివాస్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.