సుధీర్ కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్‌రావు
NEWS Oct 29,2024 05:22 pm
మెట్‌పల్లి మండలం వెంపేట్ గ్రామానికి చెందిన మారంపెల్లి సుధీర్ ఇటీవల బెహరాన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కుటుంబాన్ని టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు. వారితో పాటు నాయకులు సామల్ల గంగాధర్, కల్లెడ గంగాధర్, ఏలేటి వినోద్ రెడ్డి, యండి కరీం, నల్ల జనార్దన్ రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, మెహబూబ్ ఖాన్, తదితరులు వున్నారు.