పట్టపగలు కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
NEWS Oct 29,2024 04:12 pm
పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో పట్టపగలు చోరీ జరిగింది. కానిస్టేబుల్ సిమన్ అల్లదుర్గం ఉదయం ఇంటి నుండి వెళ్లి సాయంత్రం వచ్చే లోగ ఇంట్లో దొంగలు పడ్డారు. 8.5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 15వేల నగదు చోరికి గురైనట్లు ఆయన పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఘటన స్థలానికి చేరుకున్న సిఐ రేణుక రెడ్డి విచారణ చేపట్టారు.