కోరుట్ల: స్వచ్ఛ దివాలి - శుభ్ దివాలి
NEWS Oct 29,2024 12:09 pm
కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ దివాలి - శుభ్ దివాలి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శివ దుర్గ సమాఖ్యలోనీ సభ్యులు తయారు చేసిన మట్టి పాత్రలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ.. దీపావళి రోజు ప్రకృతికి హాని కలగకుండా ఉండే విధంగా మట్టి పాత్రలోనే దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, మెప్మాసిఓలు సంధ్య గంగరాణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.