టపాసులు దుకాణాలకు నిబంధనలు: SP
NEWS Oct 29,2024 11:10 am
జగిత్యాల: లైసెన్స్ ఉన్నవారు మాత్రమే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేయాలని, నిబంధన మేరకే నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయకూడదని సూచించారు.