సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
NEWS Oct 29,2024 04:46 pm
రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూరు నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.