పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో మెడికల్ క్యాంప్
NEWS Oct 29,2024 05:14 am
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఏపీఎస్పీ 11వ బెటాలియన్ లో రక్తదాన శిబిరం, ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇంచార్జ్ కమాండెంట్ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు నందు 189 మంది ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.