జన్వాడ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
NEWS Oct 29,2024 03:25 am
జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి సోమవారం పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఆయన ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్‌లో ఉంది. పార్టీ జరిగిన రోజు తన ఫోన్ బదులుగా వేరే మహిళ ఫోన్‌ను విజయ్ పోలీసులకు ఇచ్చాడు. దీంతో తన ఫోన్ తనకు ఇవ్వాలంటూ సోమవారం సదరు మహిళ మోకిల పోలీసులను ఆశ్రయించింది. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొకైన్ డ్రగ్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.