పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి
NEWS Oct 29,2024 03:05 am
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టేక్మాల్ తహసీల్దార్ తులసీరాం కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, PRCని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు.