మల్లాపూర్‌లో రాయికల్ వాసుల అన్నదానం
NEWS Oct 28,2024 06:49 pm
మల్లాపూర్: వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం మల్లాపూర్ శ్రీ కనక సోమేశ్వర స్వామి గుట్ట కింద సోమవారం రాయికల్ పట్టణంకు చెందిన వాసం శివకుమార్- అర్చన దంపతులు వారి కూతుళ్లు శ్రీ చందన, శ్రీ కృప ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. గుట్టపై సోమేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించారు. అన్నదాన దాతలకు ఎల్లప్పుడూ స్వామి వారి కృప ఉండాలని ప్రార్థించారు.