సౌచాలయాలు అశుభ్రత - న్యాయమూర్తి అసహనం
NEWS Oct 28,2024 06:52 pm
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, సోమవారం వేపలగడ్డ, సుజాతనగర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్ రూం, స్టోర్ రూమ్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. సౌచాలయాలు శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తం రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.