రేవంత్‌పై హత్య కేసు నమోదు చేయాలి
NEWS Oct 28,2024 04:10 pm
కూకట్‌పల్లిలో హైడ్రా కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని, ఇది హత్య అని, సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాపై హత్య కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూలగొడతామంటూ ప్రభుత్వం భయానక వాతావారణం సృష్టించిందని, పిల్లలు పుస్తకాలను తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు.