సబ్ కలెక్టర్‌కి వరద బాధితుల వినతి
NEWS Oct 28,2024 01:41 pm
అధికారుల నిర్లక్ష్యం వల్ల కొండపల్లిలో వరదసాయం అందలేదని సీపీఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్, 26వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చైతన్యకి బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కొండపల్లి కొత్తగేటు, శ్రామికనగర్, అంబేద్కర్ నగర్, ఇబ్రహీంపట్నం దుర్గా కాలనీ, తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.