జాతీయ కబడ్డీ పోటీలకు మధు ఎంపిక
NEWS Oct 28,2024 11:48 am
సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన అర్దవేని భీమయ్య-పోషవ్వ దంపతుల కుమారుడు మధు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. కరీంనగర్ పట్టణ వాణినికేతన్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సౌత్ జోన్ తరపున జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో కళాశాల యాజమాన్యం, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.