ఆత్మకూరులో బీజేపీ సభ్యత్వ నమోదు
NEWS Oct 28,2024 11:46 am
మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ముల రాజుపాల్ రెడ్డి, నాయకులు ఇల్లందుల శ్రీనివాస్, భోగ గంగాధర్, చుక్క సాగర్, కాటిపెళ్లి సురేశ్ రెడ్డి, మేడిచెల్మెల రవి తదితరులు పాల్గొన్నారు.