తెలంగాణ ప్రజలు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా?
NEWS Oct 28,2024 11:45 am
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు తాగుబోతు లాగా కనపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. విలేకరులతో మాట్లాడుతూ.. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఒక రిపోర్టర్‌ని ఒక మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజం మీకు తాగుబోతులుగా ఇళ్లలో కుటుంబ సభ్యులందరూ కూర్చుని తాగే సంస్కృతి మీకు ఉందేమో కానీ తెలంగాణ సమాజానికి దీన్ని అంట కట్టకండి అని అన్నారు.